FICCI నిర్వహించిన ‘New Age Military Technologies’ కార్యక్రమంలో భారత సైన్యం డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (Capability Development & Sustenance) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు."ఈసారి మన జనాభా కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరగవచ్చు. ఇందుకు మనం సిద్ధంగా ఉండాలి" అని హెచ్చరించారు. ఒకే సరిహద్దులో ముగ్గురు శత్రువులు ఉన్నారని.. పాక్ ను ముందు ఉంచి చైనా మనతో యుద్ధం చేసిందన్నారు. పాకిస్థాన్ సైనిక శక్తిలో 81% హార్డ్వేర్ చైనా నుంచే వస్తుందని.. చైనా తన ఆయుధాలను ప్రత్యక్ష యుద్ధ పరిస్థితుల్లో పరీక్షించుకునేలా పాక్‌ను ‘లైవ్ ల్యాబ్’లా వాడుతోందని తెలిపారు. DGMO స్థాయి చర్చల సమయంలో మన ఆపరేషన్లపై ప్రత్యక్ష సమాచారం చైనా ద్వారా పాకిస్థాన్‌కు చేరిందన్నారు. టర్కీ కూడా పాక్ కు కీలక మద్దతుదారుగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బలమైన గగన రక్షణ వ్యవస్థ అవసరమన్నారు.
#LtGenRahulSingh #IndianArmy #AirDefence #ChinaPakistanNexus #PakistanChinaAlliance #IndiaSecurity #IndianArmyUpdates #DefenceNewsIndia #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️